Pakistan: పాకిస్తాన్ ఒకే సారి రెండు దేశాలతో ప్రేమాయణం నడుపుతోంది. చైనాకు కన్నుగీటి, అమెరికాను కౌగిలించుకుంటోంది. తమ ఉక్కు స్నేహితుడిగా చైనాను, పాకిస్తాన్ పిలుస్తుంటుంది. అయితే, అలాంటి స్నేహితుడిని ఇప్పుడు పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ నాయకత్వం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు దగ్గర అవుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇప్పటికే ట్రంప్‌తో వైట్‌హౌజ్‌లో విందులో పాల్గొన్నారు. ఇప్పుడు, పాకిస్తాన్ ప్రధాని కూడా ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.
USA: అమెరికా ఎప్పుడూ కూడా నమ్మకమైన మిత్రదేశంగా ఉండదనేది మరోసారి బహిర్గతమైంది. అమెరికా మాజీ అగ్రశ్రేణి దౌత్యవేత్త హెన్రీ కిస్సింజర్ ఒకానొక సమయంలో మాట్లాడుతూ.. “అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం కావచ్చు, కానీ అమెరికాకు స్నేహితుడిగా ఉండటం ప్రాణాంతకం.” అని అన్నారు. ఈ మాటలు ప్రస్తుతం అమెరికాకు చక్కగా సరిపోతాయి. భారత్‌తో ఒక వైపు వ్యూహాత్మక సంబంధాలు కావాలంటూనే, మరోవైపు పాకిస్తాన్‌కి ఎక్కడా లేని ప్రాధాన్యత ఇస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఇటీవల ఫీల్డ్ మార్షల్‌గా పదొన్నతి…
US General: అమెరికాకు భారత్, పాకిస్తాన్ ఒకటే అని చెప్పకనే చెప్పింది. అమెరికు చెందిన ఒక టాప్ జనరల్ మాట్లాడుతూ.. వాషింగ్టన్‌కు న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌తో బలమైన సంబంధాలను కలిగి ఉందని చెప్పారు. ఉగ్రవాదంపై అమెరికా పోరాటానికి ఆ ప్రాంతంలో భాగస్వామిగా పాకిస్తాన్ ఖచ్చితంగా అవసరమని అన్నారు.
Pakistan: అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి పాకిస్తాన్‌కి అసలు నిద్ర పట్టడం లేదు. తమ పరిస్థితి ఇలా ఐపోయిందని తెగ బాధపడుతోంది. ట్రంప్ క్యాబినెట్‌లోని తీసుకున్న వ్యక్తులను చూస్తే ఆ దేశం తెగ భయపడిపోతోంది. ప్రతీ రోజు పాక్ మీడియాలో ట్రంప్ క్యాబినెట్, ఇండియా పరపతి పెరిగిపోతుందని అక్కడి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు.