Pakistan: పాకిస్తాన్‌కి నిద్రలేని రాత్రులు.. ట్రంప్ క్యాబినెట్‌తో భయం భయం..
- ట్రంప్ నిర్ణయాలతో పాకిస్తాన్‌లో భయం భయం..
- క్యాబినెట్‌లోకి ప్రో-ఇండియా వ్యక్తులు..
- పాక్ అంటే గిట్టని మార్కో రూబియో, మైక్ వాల్ట్జ్, తులసీ గబ్బార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి పాకిస్తాన్‌కి అసలు నిద్ర పట్టడం లేదు. తమ పరిస్థితి ఇలా ఐపోయిందని తెగ బాధపడుతోంది. ట్రంప్ క్యాబినెట్‌లోని తీసుకున్న వ్యక్తులను చూస్తే ఆ దేశం తెగ భయపడిపోతోంది. ప్రతీ రోజు పాక్ మీడియాలో ట్రంప్ క్యాబినెట్, ఇండియా పరపతి పెరిగిపోతుందని అక్కడి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ట్రంప్ మంత్రి వర్గంలో విదేశాంగ మంత్రి మార్కో రుబియో, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్(ఎన్ఎస్ఏ) మైక్ వాల్ట్జ్, నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తులసీ గబ్బార్డ్, సీఐఏ చీఫ్ జాన్ రాక్లిఫ్‌గా నియమించడాన్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోతోంది.
విదేశాంగ మంత్రి మార్కో రూబియో:
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
తదుపరి యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా మార్కో రూబియోని నియమించడంపై పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. పాక్, చైనాలకు పరమ వ్యతిరేకి ఈయనకు పేరుంది. అదే సమయంలో భారత్‌కి రూబియో అత్యంత సన్నిహితుడు. పాక్ అంటే వ్యతిరేకించడంతో పాటు పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకోవాలంటే భారత్‌తో విస్తృత సహకారాన్ని పెంపొందించుకోవాలని పలు సందర్భాల్లో కోరారు. ఈయన ‘‘యూఎస్-ఇండియా డిఫెన్స్ కోఆపరేషన్ యాక్ట్’’ అని పేరుపెట్టారు. దీని ద్వారా జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా మరియు నాటోతో సహా అగ్రశ్రేణి US మిత్రదేశాలతో సమానంగా భారతదేశాన్ని పరిగణించాలని కోరారు. సాంకేతిక బదిలీ చేయాలని సూచించారు.
Read Also: Kasthuri: నటి కస్తూరి భర్త, కొడుకు, కూతుళ్ల గురించి తెలుసా?
జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్:
భారత్‌కి అత్యంత సన్నిహితుడిగా మైక్ వాల్ట్జ్‌ని పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో పాకిస్తాన్‌ని తీవ్రంగా విమర్వించారు. పాక్ గురించి మాట్లాడుతూ.. ‘‘ ఉగ్రవాదం విదేశాంగ విధానానికి సాధనం కాదు. అది లష్కరే తోయిబా, ఉగ్రవాదులు కావచ్చు ఆమోదయోగ్యం కాదు. పాక్ ప్రభుత్వం, పాకిస్తానీ మిలిటరీ, ఇంటెలిజెన్స్ సర్వీస్(ఐఎస్ఐ) వీటిని నిరోధించాలి’’ అని చెప్పారు.
US నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్:
అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమితులైన తులసీ గబ్బార్డ్, అత్యున్నత పదవిని సంపాదించారు. ఈమె కింద 18 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పనిచేయబోతున్నాయి. ఈమె పాకిస్తాన్‌కి గట్టి వ్యతిరేకి, పలు సందర్భాల్లో మైనారిటీ హిందువులపై ఆ దేశం చేస్తున్న దాడుల్ని ఖండించారు. 2011లో పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో యుఎస్ నేవీ సీల్స్ ఆపరేషన్‌లో మరణించిన అప్పటి అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించినందుకు ఆమె అనేక సందర్భాల్లో పాకిస్తాన్‌ను నిందించింది.
CIA చీఫ్ జాన్ రాక్లిఫ్:
సీఐఏ చీఫ్ జాన్ రాట్ క్లిఫ్‌గా నియమితులవ్వడం కూడా పాకిస్తాన్‌కి మింగుడు పడటం లేదు. ఈయనకు కూడా పాకిస్తాన్ అంటే మంచి అభిప్రాయం లేదు.
తాజావార్తలు
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!