మాస్కులతో నోళ్లు మూస్కోవటం జనాలకి జీవితంలో భాగమైపోయింది. అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. అయితే, అమెరికాలో కొన్ని మల్టీ ప్లెక్సులు మాత్రం ‘మాస్క్ అక్కర్లేదు’ అంటున్నాయి! అయితే, ఇది అందరికీ వర్తించే రూల్ కాదు. అలాగే, అన్ని చోట్లా కూడా కాదు. పూర్తిగా వ్యాక్సినేషన్ ప్రక్రియని పూర్తి చేసిన ఆడియన్స్ తమ సినిమా హాళ్లలో మాస్క్ తీసేయవచ్చని యూఎస్ లోని మేజర్ సినిమా చైన్స్ తాజాగా ప్రకటించాయి. అయితే, ఇదంతా అన్ని చోట్లా వర్తించే నియమం కాదు.…