యూరియా కొరతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆగస్టులో లక్షా 65 వేల టన్నులు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 65 వేల టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చింది. ఇంకా లక్ష టన్నుల యూరియా రావాల్సి ఉంది. అయితే, జూలైలోనూ 50 వేల టన్నులు తక్కువ వచ్చింది. దీంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. గత నెల, ఈ నెల వర్షాలు విస్తారంగా కురవడంతో పంటల సాగు ఎక్కువగా జరిగింది.