సాధారణంగా రోడ్లు వేసేటప్పుడు, పెద్ద పెద్ద భవంతులు నిర్మించే సమయంలో చెట్లు అడ్డుగా ఉంటే ఏం చేస్తారు? దాన్ని నరికి పక్కన పారేస్తారు. ఇదే సులభమైన పని కదా.. కానీ.. సికింద్రాబాద్ మారేడ్పల్లిలో మాత్రం ట్రాఫిక్ పోలీసులు చెట్టుకు ప్రాణప్రతిష్ట చేశారు. రోడ్డుపై ఉన్న భారీ వృక్షాన్ని వేళ్ళతో సహా పెకిలించి, మరోచోట నాటారు. భారీ క్రేన్ల సహాయంతో చెట్టును తరలించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ వినూత్న ప్రయత్నం సఫలీకృతం కావడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో…
Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ అంశంపై నేడు (బుధవారం) జరుగుతున్న విచారణ సందర్భంగా.. “చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు” అంటూ జస్టిస్ బి. ఆర్.గవాయ్ వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు ప్రభుత్వ పక్షాన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి వాదనలు వినిపించారు. అయితే, ఈ విచారణలో.. నాశనం చేసిన వందల ఎకరాల అడవులను మీరు ఎలా పునరుద్ధరిస్తారు? అంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పర్యావరణ…
మూసీ పరిసరాల్లో నిర్మాణాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పురపాలక శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం.. మూసీ నది పరిసరాల్లో నిర్మాణ అనుమతులపై కఠిన నియంత్రణలు అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి నాలుగు మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మూసీకి 50 మీటర్ల పరిధిలో బఫర్ జోన్ కల్పించి, ఆ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. అలాగే, 50 నుంచి 100 మీటర్ల మధ్య ప్రాంతంలో కొత్తగా…
GHMC: హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ (GHMC) స్టాండింగ్ కమిటీ సమావేశం నేడు మధ్యాహ్నం జరగనుంది. మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మొత్తం 15 కీలక అంశాలపై చర్చించనున్నారు. నగర అభివృద్ధి పనులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణం పనుల కోసం భూసేకరణకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపనుంది. హెచ్ సిటీ ప్రాజెక్టుల భూసేకరణ సంబంధించి ఇతర పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన…
Musi River Front : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వేగంగా అమలవుతోంది. ఈ ప్రాజెక్ట్ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు మూసీ నిర్వాసితుల పునరావాసం, ఆర్థిక సహాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కు పురపాలక శాఖ రూ. 37.50 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పటికే నదిగర్భంలో నివసిస్తున్న కుటుంబాలకు తాత్కాలిక ఖర్చుల నిమిత్తం రూ. 25 వేల…
HYDRA: హైదరాబాదులోని అమీన్ పూర్‌లో మరోసారి హైడ్రా అధికారుల కూల్చివేతలు ప్రారంభం కానున్నాయి. ఈ కూల్చివేతలు అమీన్ పూర్ పెద్ద చెరువు వద్ద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై జరుగుతున్నాయి. పలు ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు, చెరువును ఆక్రమించుకొని నిర్మాణాలు చేయడాన్ని గుర్తించారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలిన వెంటనే, హైడ్రా కమిషనర్ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కూల్చివేతలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. హైడ్రా అధికారులు ఈ కూల్చివేతల సమయంలో ప్రజల…
HYDRA : హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఫోకస్ పెట్టారు. తుర్కయాంజల్ చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. చెరువు తూములు మూసేసి అలుగు పెంచడంతో చెరువుపై భాగంలో పంటపొలాలు, ఇళ్ళు నీట మునుగుతున్నాయని స్థానికులు ఇటీవల హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో నేరుగా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించారు హైడ్రా కమిషనర్. తుర్కయాంజల్ చెరువు FTL పైన వచ్చిన ఫిర్యాదులపై ఏవీ రంగనాధ్ పరిశీలన చేశారు.…
HYDRA : అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం కూల్చివేత చేపట్టి 5 అంతస్తుల భవనం నేల మట్టం చేసింది. అయితే దీనిపై హైడ్రా ప్రకటన విడుదల చేసింది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజీలోని అయ్యప్ప సొసైటీ సర్వే నంబరు 11/5 లో ప్లాట్ నంబరు 5/13 పేరిట 684 గజాలలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేసింది హైడ్రా.. ఈ కూల్చివేతలో స్థానిక పోలీసులతో పాటు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. జీహెచ్ ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను…
Minister Narayana : నరేడ్కో (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్)సెంట్రల్ జోన్ డైరీ 2025 ను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మేల్యేలు బోండా ఉమా, యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ను ఘనంగా NAREDCO సభ్యులు సత్కరించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు అని అన్నారు. మూడు ముక్కలాటతో అమరావతినీ…
నెల్లూరులో నగర పాలక సంస్థ కార్యాలయంలో వివిధ విభాగాలు, కార్పొరేటర్లతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జగన్ అరాచక పాలన చేశారని.. ఐదేళ్లపాటు నియంత పాలన కొనసాగిందని ఆయన విమర్శించారు.