తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మానవత్వపు విలువలు మరచి, ఆస్తి కోసం సొంత బంధాన్నే అడ్డుకున్నాడు ఓ వ్యక్తి. ఆస్తికోసం దత్తపుత్రుడి హక్కును సొంత సోదరుడు అడ్డుకున్నాడు. అంత్యక్రియలు నిర్వహించే హక్కుపై ఆస్తి వివాదం కారణంగా దత్తపుత్రుడిని అతని సొంత సోదరుడే అడ్డుకోవడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. చివరకు ఆస్తిలో వాటా కోసం పట్టుబట్టిన దత్తపుత్రుడి సోదరుడు.. అంత్యక్రియలను పూర్తి చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే… జగిత్యాల పట్టణంలోని ఉప్పరిపేటలో గత రాత్రి…