సైబరాబాద్ కమీష్నరేట్ పరిధిలో వరస చైన్ స్నాచర్ లు హల్ చల్ చేసి గంట వ్యవధిలో 6 చోట్ల చైన్ స్నాచింగ్ కి పాల్పడిన ఘటన మరివకముందే మళ్లీ ఇలాంటి ఘటనలే చోటుచేసుకోవడంతో నగర ప్రజలు భయాందోళన గురవుతున్నారు.
హైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. చైన్ స్నాచింగ్ ఘటనలతో అప్రమత్తమయ్యారు రాష్ట్ర పోలీసులు. తెల్లవారు జామునుంచే స్నాచర్ల ఫోటోలతో రోడ్లపై పోలీసుల తనిఖీలు చేస్తున్నారు.
సైబరాబాద్ కమీష్నరేట్ పరిధిలో వరస చైన్ స్నాచర్ లు హడల్ ఎత్తిస్తున్నారు. తెంపుడుగాళ్ళు రోజుకో ప్రదేశం మార్చి మహిళలకు వనుకు పుట్టిస్తున్నారు. వరుస చైన్ స్నాచింగ్ లతో పోలీసులకు సవాల్ గా మారింది. గంటల వ్యవధిలో చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.