డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేసింది. దాదాపు అందరు ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలా డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా ప్రతి రోజు వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాగా భారతదేశ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది. యూపీఐ ఉపయోగించే దేశాల జాబితాలో ఖతార్ చేరింది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రాజధాని దోహాలోని లులు మాల్‌లో UPI వ్యవస్థను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో, UPI అనేది…