ఓ వ్యక్తి ఆర్థిక పరిస్థితి బాగోలేక రుణ వాయిదా(ఈఎంఐ) చెల్లించలేదు. దీంతో ఆ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగుల చేసిన దారుణం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటు చేసుకుంది. ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు ఓ వ్యక్తి ఈఎంఐ చెల్లించలేదని అతడి భార్యను తీసుకెళ్లారు. వాయిదా చెల్లించి భార్యను తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు ఉద్యోగుల వద్ద బందీగా ఉన్న భార్యను పోలీసులు విడిపించారు.…
ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాలో ఒక మహిళా కానిస్టేబుల్ ఆన్-డ్యూటీ యూనిఫాం ధరించి రీల్ చేసిన కేసు వెలుగులోకి వచ్చింది. మహిళా కానిస్టేబుల్ చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్యూటీ సమయంలో పోలీసులు రీల్స్ చేయకూడదని స్పష్టం చేస్తూ గతంలో డీజీపీ అన్ని జిల్లాలకు మార్గదర్శకాలను జారీ చేశారు. అయినప్పటికీ.. పోలీస్ స్టేషన్‌లో పోస్ట్ చేసిన మహిళా పోలీసు వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. విశేషం ఏంటంటే.. ఆమె ఫాలోవర్స్ సంఖ్య 2.5 లక్షలకు పైగా…