Dowry Harassment: అత్తింటి వారి వరకట్న దాహానికి మరో అమ్మాయి బలైంది. ఈ వారం ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ బాగ్‌పత్‌లో అత్తమామాల నుంచి కట్నం వేధింపులు తట్టుకోలేక 28 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె తాను అనుభవించిన బాధల్ని తన శరీరంపై సూసైడ్ నోట్‌గా రాసుకుంది. మంగళవారం రాత్రి మనీషా అనే మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త కుందన్, అతడి కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించింది.
Tragedy incident: ఉత్తర్ ప్రదేశ్‌లో అప్పుల బాధతో బాధపడుతున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫేస్‌బుక్ పోస్ట్ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. లైవ్‌లోనే తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డయాబెటిక్‌తో బాధపడుతున్న తన కుమార్తెకు కనీసం ఇన్సులిన్ ఇంజెక్షన్లు కొనలేని అసమర్థ స్థితి ఉన్నానని లైవ్‌లోనే విలపించారు. తన కార్యాలయంలో సెక్యూరిటీ గార్డు తుపాకీతో కాల్చుకుని మరణించాడు.