శ్రీరాముడు నడయాడిన అయోధ్య నగరం దీపాల కాంతుల్లో వెలుగులు చిందించింది. ఈ సారి దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా సరయు నది ఒడ్డున 15 లక్షలకు పైగా దీపాలు వెలిగించి అయోధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీ విషాదాన్ని మిగిల్చాయి. శుక్రవారం రాజధాని లక్నో, ఉన్నావ్, ఫతేపూర్, సీతాపూర్‌లలో గోడలు, ఇల్లు కూలిన ఘటనల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరప్రదేశ్‌లో ఘాజీపూర్ జిల్లాలోని రేవతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అథోటా గ్రామంలో బుధవారం 17 మందితో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో ఐదుగురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్‌లో నిర్మించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రారంభించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో శాంతిభద్రతలు మెరుగుపడడమే కాకుండా.. వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఇదంతా డబుల్ ఇంజిన్ సర్కారుతోనే సాధ్యం అని మోదీ స్పష్టం చేశారు
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లక్నోలో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఇక కంగనా కూడా బీజేపీ భావజాలానికి మరింత దగ్గర అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె రాజకీయ ప్రవేశం లేకున్నాను, మద్దతు తెలియజేసే అవకాశం కనిపిస్తోంది. యూపీ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కంగనా అభినందించారు. ఈ భేటీ…