పోలవరం ప్రాజెక్టుపై నేడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కీలక సమీక్ష నిర్వహించనుంది.. పోలరవం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనుల్లో కీలకమైన సమాంతర డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం అంతర్జాతీయ నిపుణుల ప్యానెల ఇచ్చిన సూచనల మేరకు ప్లాస్టిక్ కాంక్రీట్ టీ -16 మిశ్రమాన్ని కాంట్రాక్టు సంస్థ బావర్ వాడుతోంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఈ ఏడాది ఆఖరుకు పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి లక్ష్యాన్ని నిర్దేశించింది.