పారా మిలటరీ జవాన్లతో కలిసి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. సతీమణి కావ్యతో కలిసి పారామిలటరీ జవాన్లకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పండగలు, పబ్బాలు అనే తేడా లేకుండా కుటుంబాలను వదిలి నిరంతరం దేశసేవలో పనిచేస్తున్న సాయుధ బలగాలకు, వారి కుటుంబసభ్యులకు దీపావళి సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజాగాయకుడు గద్దర్ ఇవాళ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సమావేశం అయ్యారు.. దేశవ్యాప్తంగా తనపై ఉన్న కేసుల గురించి కిషన్‌రెడ్డితో చర్చించిన ఆయన.. తనపై ఉన్న కేసులు అన్నీ ఎత్తివేయాలని కోరారు.. ఇక, ఈ కేసులపై చర్చించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇప్పించాలని.. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని కోరారు గద్దర్.. కాగా, గతంలో తనపై ఉన్న కేసులను ఎత్తివేయడానికి, న్యాయసహాయం అందించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని గతంలో విజ్ఞప్తి చేశారు గద్దర్.. ప్రభుత్వం పిలుపు…