త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులు ప్రధాన భూమిక పోషించనున్నారా? టీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ వారి నుంచే తగలనుందా? షర్మిల పార్టీ నిరుద్యోగులను ఏకం చేసి టీఆర్‌ఎస్ విజయావకాశాలను దెబ్బతీస్తుందా? రేపటి ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోషించబోయే పాత్ర గురించి రాజకీయ వర్గాల్లో విశేషంగా చర్చ జరుగుతోంది. షర్మిల పార్టీతో తమకు ఎలాంటి నష్టం ఉండదని టీఆర్‌ఎస్ అంటోంది. మరోవైపు అది తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగలను…