అల్పపీడనం,భారీవర్షాల కారణంగా నెల్లూరు జిల్లా తడిసిముద్దవుతోంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వానలతో ప్రజలు అల్లాడుతున్నారు.నెల్లూరు నగరంతో పాటు గూడూరు, కావలి,సూళ్లూరుపేట,వేలాది గ్రామాల్లో ప్రజలు అసలు రోడ్ల పై నడవలేనంతగా ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. దీంతో రోడ్లు దారుణంగా పాడైపోయాయి. నెల్లూరు నగరంలో చాలా చోట్ల నీరు చేరి నిలిచిపోయింది. దీంతో వాహనాలు రోడ్ల పై తిరగలేక,అండర్ బ్రిడ్జిల కింద ఇరుక్కుపోతున్నాయి. ప్రభుత్వం,అధికారులు తమ ఇక్కట్లు, ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.…