మహానంది క్షేత్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది.. పాతికేళ్ల నాటి నాగనంది సదనం కూల్చివేత సంఘటనలో గాయపడిన ఇద్దరు కార్మికులు శివ సన్నిధిలో మృత్యువాత పడ్డారు. క్షేత్రంలోని గాజులపల్లె టోల్ గేట్ వద్ద పాతికేళ్ల క్రితం భక్తుల కోసం నాగనంది సదనం వసతి గృహాలను నిర్మించారు ఆలయ అధికారులు.