రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ సింగపూర్ చేరుకున్నారు. బుధవారం బ్రూనై పర్యటన ముగించుకుని రెండు రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్లారు. సింగపూర్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ డోలు వాయించి ఉత్సాహ పరిచారు. అలాగే ఎన్నారైలతో కలిసి ముచ్చటించారు. ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు.