బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంత్‌నాగ్‌లో ఖర్గే పర్యటించారు. ఈ సందర్భంగా కమలం పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమకు మరో 20 సీట్లు వచ్చుంటే వారంతా జైల్లో ఉండేవారని వ్యాఖ్యానించారు.