టీవీఎస్ తన పాపులర్ స్కూటర్ టీవీఎస్ స్కూటీ జెస్ట్ కొత్త వేరియంట్ SXC ని విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ రూ. 75,500 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలైంది. తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లతో వస్తోంది. కొత్త TVS స్కూటీ జెస్ట్ SXCలో వేగం, ఇంధన స్థాయి, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్ వంటి సమాచారాన్ని ప్రదర్శించే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఇది ఇప్పుడు బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంది. కాల్, SMS హెచ్చరికలను అందిస్తోంది.…