TVS Jupiter 125 DT SXC: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, తన పాపులర్ స్కూటర్ జుపిటర్ 125 కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించిన టీజర్లు సోషల్ మీడియాలో విడుదల కాగా, తాజాగా జుపిటర్ 125 DT SXC వేరియంట్‌ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది కంపెనీ. ఈ జుపిటర్ 125 స్కూటర్ వేరియంట్ ధరను కంపెనీ ప్రారంభ ధరగా రూ. 80,740 (ఎక్స్-షోరూం) నిర్ణయించారు.…