బాలతారలుగా భళా అనిపించి, నాయికలుగానూ మెప్పించిన వారున్నారు. అలాంటి వారిలో తనకంటూ ఓ స్థానం సంపాదించారు తులసి. పిన్నవయసులోనే కెమెరా ముందు అదురూ బెదురూ లేకుండా నించుని డైరెక్టర్స్ చెప్పినట్టుగా చేసేసి మురిపించిన తులసి, తరువాత నాయికగానూ కొన్ని చిత్రాల్లో మెరిశారు. ప్రస్తుతం అమ్మ పాత్రల్లో అలరిస్తున్నారు. తులసి 1967 జూన్ 20న మద్రాసులో జన్మించారు. చిన్నప్పటి నుంచీ ఎంతో చురుగ్గా ఉండేది తులసి. ఆమె తల్లికి అంజలీదేవి, సావిత్రి మంచి స్నేహితులు. ‘భార్య’ అనే సినిమాలో…