సెప్టెంబర్ 10న విడుదల కాబోతున్న ‘లవ్ స్టోరీ’కి పోటీగా నాని ‘టక్ జగదీశ్’ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఖండించారు. కొద్ది వారాల క్రితమే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ వరకూ సినిమాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కోరింది. కానీ ఆ విజ్ఞప్తిని పక్కన పెట్టి నిర్మాతలు ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేయడంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘లవ్ స్టోరీ’ విడుదల రోజునే ‘టక్…
అక్కినేని నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీ విడుదల తేదీని ప్రకటించగానే… నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీశ్’ మూవీ రిలీజ్ పై తన మనసులోని మాటను బయట పెట్టాడు. ‘టక్ జగదీశ్’ మూవీ ఓటీటీలో విడుదల కాబోతోందని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా, తాను మరోసారి క్రాస్ రోడ్స్ లో నిలబడినట్టు అయ్యిందనే ఆవేదనను వ్యక్తం చేశాడు. ఓ సినీ అభిమానిగా అందరితో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే తనకు…
న్యాచురల్ స్టార్ నాని హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ఎంసీఏ సినిమాతో కాస్త పర్వాలేదు అనిపించినా ఆతరువాత వచ్చిన సినిమాలు ఆశించినంతగా ఆడలేదు. అయితే నాని ఫ్యాన్ బేస్ తో వసూళ్లకు ఏమి ఢోకా లేకపోవడంతో ఆయన నిర్మాతలు ఉపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీకి సిద్ధమైంది. నాని థియేటర్ లో విడుదలకు మొగ్గు చూపిన.. నిర్మాతతో ఎన్ని చర్చలు జరిపిన ఫలించలేదని తెలుస్తోంది. ఆర్థికపరమైన విషయం కాబట్టి నాని…
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ…