Tirumala Darshanam: తిరుమల శ్రీవారి దర్శనాల కోసం భక్తులకు ప్రస్తుతం సులువైన సమయం. తిరుమలలో ప్రస్తుతం చకచకగా దర్శనాలు జరుగుతుండడంతో.. భక్తులు వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం పొందుతున్నారు. భక్తుల కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రోజున 56,560 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. అందులో 28,853 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి సన్నిధికి 3.34…
TTD : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు టీటీడీ సంతోషకరమైన వార్త ప్రకటించింది. శ్రీవారిని దర్శించుకోవడానికి ఆఫ్‌లైన్ టికెట్లను తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. ఈ కొత్త కౌంటర్‌ను టీటీడీ అదనపు కార్యనిర్వాహక అధికారి వెంకయ్యచౌదరి బుధవారం ప్రారంభించారు. భక్తులు ఇప్పుడు ఈ ప్రత్యేక కౌంటర్ ద్వారా రోజుకు 900 టికెట్లను ఆఫ్‌లైన్‌లో పొందవచ్చు. ఇప్పటికే ఉన్న కౌంటర్‌లో వర్షాకాలంలో భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను టీటీడీ గుర్తించి, సమయానికి నిర్ణయమైన సౌకర్యాలను అందించాలనే…
Tirumala Temple Rooms: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి కొండపై వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే.. మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్‌లైన్‌లో చేపట్టింది. దర్శన టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే గదులు ఇవ్వడం ద్వారా.. భక్తుల రద్దీని కాస్త తగ్గించొచ్చని టీటీడీ భావిస్తోంది. శ్రీవారి ఆర్జిత సేవలు, లక్కీడిప్, వృద్ధులు, దివ్యాంగులు, శ్రీవాణి ట్రస్టు, రూ.300 ప్రత్యేక…
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి సేవలో తరించేందుకు మరోసారి టీటీడీ అవకాశం కల్పించింది. ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవల టికెట్ ధర నిర్ణయిస్తూ టీటీడీ ప్రకటన చేసింది. సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.కోటి ఉండగా.. శుక్రవారం నాడు మాత్రం రూ.కోటిన్నరగా నిర్ణయించింది. ఈ టికెట్‌పై 6గురు స్వామి వారి సేవలో పాల్గొనవచ్చు. జనవరి రెండో వారం నుంచి 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను అందుబాటులో ఉంచనుంది. అయితే ఈ టికెట్ల ద్వార రూ.600…
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏపీలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుపతిలో మునుపెన్నడూ చూడన విధంగా వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు వరదల కారణంగా కొండచరియలు విరిగి ఘాట్ రోడ్డుపై పడిపోయాయి. అంతేకాకుండా మెట్టుమార్గంలో చెట్లు, వరద నీటితో అస్థవ్యస్థంగా తయారైంది. దీంతో ఘాట్ రోడ్డుపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే… తాజాగా వర్షం తగ్గుముఖం పట్టిన నేపథ్యంతో తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి…