TGSRTC : తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తించి, సమ్మె నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులకు బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సంస్థ అభివృద్ధి మార్గంలో పయనిస్తున్న సమయంలో సమ్మె అనేది తీరని నష్టానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. యాజమాన్యం వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంస్థ పూర్తిగా కట్టుబడి ఉంది. 2019లో జరిగిన సమ్మె సంస్థను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయగా,…