ఫిబ్రవరి నెల నుంచే సూర్య ప్రతాపం మొదలైంది. మార్చి నెల సగమైనా గడవక ముందే వాతావరణం మండువేసవిని తలపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు! గత ఏడాదితో పోల్చితే ఫిబ్రవరి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం మొదలైంది. మార్చి నెలలో సాధారణం కంటే రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి.
Temperatures Rise in Telangana State: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు అప్పుడే ముదిరిపోయాయి. ఇంకా మార్చి నెల కూడా రాకముందే ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణలో దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32 నుంచి 37 డిగ్రీల మధ్యన పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.…
TS Temperature: తెలంగాణలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైంది. రుతుపవనాలు దాదాపు 2 వారాలు ఆలస్యంగా రాష్ట్రాన్ని ముంచెత్తాయి. జూన్ మొదటి వారంలో కురవాల్సిన వర్షాలు.. జూన్ 20 తర్వాత అడపాదడపా కురిశాయి.