Gujarat Man Falls To Death From US Border: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన భారతీయుడు ప్రమాదవశాత్తు మరణించాడు. వివరాల్లోకి వెళితే గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లా కలోల్ తాలూకా నివాసి అయిన బ్రిజ్ కుమార్ యాదవ్ మెక్సికో-అమెరికా సరిహద్దు దాటుతూ మరణించినట్లు అమెరికన్ మీడియా వార్త కథనాలను ప్రచురించింది. ‘ట్రంప్ వాల్’గా పిలువబడే భారీ గోడ అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో ఉంది. ఈ గోడను దాటి బ్రిజ్ కుమార్ కుటుంబం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాలని చూసింది.…