Donald Trump: రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపాలని, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి కఠినమైన చర్యలు విధించాలని శనివారం నాటో దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. నాటో దేశాలతో పాటు ప్రపంచాన్ని ఉద్దేశిస్తూ ట్రంప్ లేఖ రాశారు. ‘‘అన్ని నాటో దేశాలు అంగీకరించి రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపివేసినప్పుడు, నేను రష్యాపై ప్రధాన ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నాను.