Trump Tariffs: రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తోన్న దేశాలపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టారిఫ్ బాంబులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మాస్కోతో చమురు వాణిజ్యం చేస్తే భారత్ సహా ఆయా దేశాలపై 100శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అయితే.. నిన్న భారత్‌పై 50% శాతం అదనపు టారిఫ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా, భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్‌పై 25 శాతం సుంకం విధిస్తామని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి కొత్త సుంకం వర్తిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. నిజానికి, వాణిజ్య ఒప్పందం గురించి ఇరు దేశాల మధ్య చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో దీని గురించి సమాచారం ఇచ్చారు.