ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుందో ఏమో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ధైర్యంగా ట్రక్ నడిపేసింది. అయితే ఇది నిజంగా కాదు… సినిమా కోసం. ‘సర్దార్ కా గ్రాండ్ సన్’ బాలీవుడ్ సినిమాలో అర్జున్ కపూర్ తో కలసి నటిస్తోంది రకుల్. ఈ కామెడీ డ్రామాలో ఇంకా జాన్ అబ్రహామ్, అదితిరావ్ హైద్రీ, నీనా గుప్త ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాస్వీ నాయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోనే…