తెలియని ఫోన్ నెంబర్‌తో కాల్ వస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి పేరుతో ఉన్నది అని తెలుసుకునేందుకు కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్‌ను వినియోగిస్తుంటారు. 11 ఏళ్ల క్రితం ఈ యాప్ ప్రారంభం అయింది. ఇప్పటి వరకు మొత్తం 30 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది. గతేడాది వరకు 25 కోట్ల మంది యూజర్లు ఉండగా, ఏడాది కాలంలో మరో 5 కోట్ల మంది కొత్త యూజర్లు యాడ్ అయినట్టు ట్రాకాలర్ యాప్ తెలియజేసింది.…