ప్రపంచ పర్యావరణం కాపాడటమే లక్ష్యంగా, కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు పాటుపడాలనే సంకల్పంతో చేపట్టిన అంటార్కిటికా యాత్రలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాలంటీర్‌కు చోటు దక్కింది.
పార్లమెంటరీ సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ గుజరాత్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని టీఆర్ఎస్ ఎంపీలు సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇతర సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక మల్ధారిస్ అనే గిరిజనులతో స్టాండింగ్ కమిటీ సభ్యులు మమేకం అయ్యారు. ప్రకృతి నియమాలను గౌరవిస్తే అడవి జంతువులతో కూడా జీవించవచ్చని మల్ధారిస్ గిరిజనుల వద్ద తెలుసుకున్నామని టీఆర్ఎస్…