Santosh Kumar: ఆసియాలోనే రెండో అతిపెద్ద మర్రిచెట్టు తెలంగాణలోనే ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రిలో ఈ వృక్షం నెలకొని ఉంది. 800 ఏళ్ల నాటి ఈ పురాతన వృక్షాన్ని సంరక్షించేందుకు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ నడుం బిగించారు. ఇప్పటికే ఆయన పర్యావరణ పరిరక్షణకు ఎంతో పాటుపడుతున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో సెలబ్రిటీల చేత మొక్కలు నాటిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఎన్నో లక్షల మొక్కలను నాటారు. తాజాగా మహబూబ్‌నగర్…
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ కార్యక్రమంలో తాజాగా ప్రముఖ గాయని సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్కులో సింగర్ సునీత మొక్కలు నాటారు. అనంతరం సునీత మాట్లాడుతూ.. సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రకృతి కన్నతల్లి లాంటిది అని.. కన్నతల్లిని ఎలా ప్రేమగా చూసుకుంటామో.. అదేవిధంగా…
టీఆర్ఎస్‌ను వీడి.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన DS.. ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? రాజ్యసభ సభ్యత్వానికి గుడ్‌బై చెప్పాకే కాంగ్రెస్ కండువా కప్పుకొంటారా? నైతికత కింద రాజీనామా చేస్తారా? ఇంకేదైనా వ్యూహం ఉందా? రాజకీయాల్లో చురుకైన పాత్ర కోసం చూస్తున్నారా? పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడటంతో.. కాంగ్రెస్‌లో డీ శ్రీనివాస్ చేరిక త్వరలోనే ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశమై.. తిరిగి పాత గూటిలోకి వెళ్లేందుకు సమ్మతి తీసేసుకున్నారు. అయితే…
ప్రభుత్వం 37 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది.. గతంలో మాదిరిగా బిల్లులు పెట్టి చర్చ లేకుండా పాస్ చేయవద్దని చెప్పాం అన్నారు టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు.. పార్లమెంట్ లో ముందు ప్రజా సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేశాం. తెలంగాణలో పంట మొత్తం కొనాలి.. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ధాన్యం పంట కొనుగోలు గురించి రెండు నెలల్లో 4,5 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు చర్చించారు. చివరికి చేతులు ఎత్తేసి..…
బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట మాట్లాడుతున్నారు అని టీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన నిధులు, రైతుల గురించి పోరాడే పార్టీ టిఆర్ఎస్… నల్ల చట్లాలను వెనక్కి తీసుకునే విధంగా పోరాడాం. రైతుల పట్ల పోరాడే ఒకే ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమే అని అన్నారు. ఇక భవిష్యత్ లో రైతుల పక్షాన నిలబడే పార్టీ టీఆర్ఎస్. నల్ల చట్టాలు వెనక్కి తీసుకురావడం శుభ…
ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగన్దినా అన్నట్లుగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అవిశ్రాంతంగా ముందుకు సాగుతుంది. మానవ మనుగడకు నేను సైతం అనే చేతులన్నీ ఒక్కటై మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. మరో మూడు హృదయాలను కదిలిస్తున్నాయి. స్వదేశం, విదేశం అనే తేడా లేకుండా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రపంచమంత కదలిస్తుంది. ఈ క్రమంలోనే, ఈ రోజు శ్రీలంక డిప్యూటీ హై కమీషనర్ డా. డి వెంకటేశ్వరన్ “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో భాగంగా జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ పార్క్…
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలౌతున్నాయు. మొదటి విడతలో గొర్ల కాపర్లకు రూ. 5 వేల కోట్లతో 3లక్షల 71 వేల మందికి గొర్రెల పంపిణీ చేశారు. రెండో విడతలో గొర్ల పంపిణీ కోసం 6 వేల కోట్లు రూపాయలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు అని టీఆర్ఎస్, రాజ్యసభ ఎంపీ లింగయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో డీడీలు కట్టిన…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కలిశారు. ఈ నెల 24 న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమంలో అందర్నీ భాగస్వామ్యులను చేసి విజయవంతం చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్…
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఎలా పెరిగిపోతుందో మనందరం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మన హైదరాబాద్ నగరానికి రాకూడదంటే మనందరం బాధ్యతగా ఎవరికి వారు మొక్కలు నాటి వాటిని సంరక్షించే చర్యలు చేపట్టాల్సిందిగా ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. రహ్మత్ నగర్ డివిజన్‌లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి సంతోష్ కుమార్ మొక్క నాటారు.…