టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం లోపించిందా? ఎమ్మెల్యే కోటాతోపాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ఇదే చర్చ జరుగుతోందా? సామాజిక సమతుల్యత కోసం చివరి వరకు ప్రయత్నించినా ఎందుకు సాధ్యం కాలేదు? ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలపై చర్చ..! తెలంగాణలోని 9 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ జరుగుతుండటంతో.. ఆ వేడి రాష్ట్రమంతా కనిపిస్తోంది. ఏకగ్రీవాలు అయినచోట ఒకలా.. పోటీ తప్పదనుకున్నచోట మరోలా చర్చలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే…