సీఎం కేసీఆర్ నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. అయితే ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం కేసీఆర్ ఈ రోజు నల్గొండ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య చిత్రపటం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం భోజనం తరువాత సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుంచి…
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి మారయ్య (73) శుక్రవారం అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గాదరి మారయ్య ఉమ్మడి నల్గొండ జిల్లాలో పీఈటీ మాస్టర్‌గా సేవలందించారు. ఆయన స్వస్థలం నల్గొండ మండలం నర్సింగ్‌భట్. ప్రస్తుతం నల్గొండ పట్టణంలో కుటుంబంతో కలిసి జీవిస్తున్న మారయ్యకు శుక్రవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. Read Also: మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌కు బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్ కాగా…
తాజాగా బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ వేదికగా జరిగిన సభలో కేసీఆర్ ప్రభుత్వం పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగం పోయే పరిస్థితుల్లో ప్రవీణ్‌కుమార్ వీఆర్‌ఎస్ తీసుకున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న ప్రవీణ్‌కుమార్ ఏ కార్యక్రమాలు చేయకుండా కేంద్రంలో…