తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మరికొద్దిరోజుల్లో కొలిక్కి రానుంది. ఆశావహులు కేసీఆర్ ని ప్రసన్నం చేసుకుని పదవులు పొందేరు. చాలామటుకు ఎమ్మెల్సీ పీట్లు ఏకగ్రీవం అయ్యాయి. మరికొన్నింటికి డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పెద్దల సభకు వెళ్ళాలనుకునేవారి కల సాకారం అయింది. ఇందులో చాలామంది రెండుసార్లు ఎమ్మెల్సీ సీట్లు పొందారు. పదవులు రానివారు నామినేటెడ్ పదవుల వైపు మొగ్గుచూపుతున్నారు. 2014లో తెలంగాణ కల సాకారం అయ్యాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి రెండోసారి…