ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులోకి తెలంగాణ వాళ్ళను రమ్మని మేం పిలవలేదన్నారు. దర్యాప్తు జరుగుతుంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి. నిప్పులు వస్తుందో లిక్కర్ వస్తుందో మాకు తెలియదని చురకలంటించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరు త్వరలో భారత్ రాష్ట్రీయ సమితిగా మారనుంది. త్వరలో సీఎం కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. దానికి భారత్ రాష్ట్రీయ సమితి అని పేరు పెట్టనున్నారు. దీనికి కారు గుర్తునే కొనసాగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ పేరు మార్పు, బైలాస్‌లో మార్పులపై విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘంతో TRS ఇప్పటికే చర్చలు పూర్తి చేసింది. గులాబీ బాస్ ఆలోచనలు చూస్తుంటే TRS కాస్తా.. అతి త్వరలోనే BRSగా మారనుండటం…