నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి పై దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు. ఈ దాడికి ప్రధాన కారణమైన ఎమ్మెల్సీ కవితపై కూడా పోలీసులు కేసు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికల హామీని నిలబెట్టుకోలేకపోయారంటూ టీఆర్‌ఎస్ శ్రేణులు శనివారం నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్ కార్యకర్తలతో ఘర్షణకు దిగి రాళ్లతో దాడి చేయడంతో ధర్పల్లి మండలంలో విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. ధర్పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఎంపీ అరవింద్ వస్తున్నారని తెలుసుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని టీఆర్‌ఎస్…