Triple riding ban on bike in Mangaluru: కర్ణాటకలోని మంగళూర్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బైక్ పై ముగ్గురు పురుషులు ప్రయాణించడాన్ని నిషేధించారు. ఆగస్టు 8 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. అయితే 18 ఏళ్లలోపు వారికి, వృద్ధులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో కర్ణాటకలో మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.