ఉత్తరప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్ జిల్లాలోని సహన్సారా నది ఒడ్డున తవ్వకాలలో మూడు కొమ్ముల డైనోసార్ అయిన ట్రైసెరాటాప్స్‌కు చెందినదిగా భావిస్తున్న శిలాజం బయటపడింది. ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో లక్షలాది సంవత్సరాల నాటి ట్రైసెరాటాప్స్ ముక్కు కొమ్ము బయటపడిందని నిపుణులు భావిస్తున్నారు. నేచురల్ హిస్టరీ అండ్ కన్జర్వేషన్ సెంటర్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ ఉమర్ సైఫ్ మాట్లాడుతూ.. ఒక కొత్త శిలాజం బయటపడింది. అది ట్రైసెరాటాప్స్ కి చెందినదిగా భావిస్తున్నారు… ఆ శిలాజం దాని ముక్కులో ఒక భాగం. ఇది…