మహారాష్ట్రలోని నలసోపారా పట్టణంలో నివసిస్తున్న 80 ఏళ్ల గణపత్ నాయక్ కి మహరాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డ్ అధికారులు షాకిచ్చారు. ఇటీవల దాదాపు 80 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లు అందుకున్న తరువాత ఆయనకు హై బీపీ పెరగడంతో ఆయనను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మహరాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎంఎస్‌ఇడిసిఎల్) విద్యుత్ బిల్లును సరిచేసింది. బిల్లులో పేర్కొన్న ఈ ఎనభై కోట్ల అధిక మొత్తం టైపింగ్ మిస్టేక్ ఫలితంగా వచ్చిందని…