ట్రైలర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ‘సినిమా బండి’కి ఇప్పుడు మంచి స్పందన లభిస్తోంది. మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం ట్రెండింగ్ నెంబర్ 1లో ఉండడం విశేషం. ఈ వైవిధ్యమైన చిత్రంతో ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయం కాగా… ఈ చిత్రం ఆటో రిక్షా డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. ఆటో డ్రైవర్ కు తన ఆటో వెనుక సీట్లో కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో తన స్నేహితుడితో కలిసి మంచి సినిమా చేయడానికి…