తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారుల బదిలీలపై ఆరోపణలు వస్తున్నాయి. ప్రక్షాళన పేరుతో అనర్హులను అందలం ఎక్కించారని మండిపడుతున్నారు వైద్యాధికారులు. ఏళ్లుగా పని చేయకుండా ఉన్న సీనియర్లను తప్పించేందుకు ఆకస్మిక బదిలీలు చేపట్టారనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో ముగ్గురు జిల్లా వైద్యాధికారులను బదిలీ చేసింది. మేడ్చల్ జిల్లా DMHO డాక్టర్ మల్లికార్జున్‌ను యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా పనిజేస్తున్న డాక్టర్ పుట్ల శ్రీనివాసుకు DMHOగా పోస్టింగ్ ఇచ్చారు. యాదాద్రి…