Delhi: ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. గురువారం తెల్లవారుజామున ఢిల్లీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. బుధవారం రాత్రి 11.30 గంటలకు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ యూపీ, వాయువ్య మధ్యప్రదేశ్‌లోకి పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
రైళ్లు ఎందుకు ఆలస్యంగా నడుస్తాయంటే షెడ్యూలింగ్‌లో అనూహ్యమైన మార్పులు చేర్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సిగ్నలింగ్ సమస్యలు, అనుకోని అంతరాయాలు.. ఇలా పలు కారణాలు చెప్పొచ్చు. అయితే పశువుల వల్ల కూడా రోజుకి సగటున 11 రైళ్లు లేట్‌గా రాకపోకలు సాగిస్తున్నాయని రైల్వే శాఖ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీనివల్ల రైల్వేలకు భారీగా నష్టాలొస్తున్నాయి. మేత కోసం పశువులు రైల్వే ట్రాక్‌ల మీదికి వస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. అదే సమయంలో రైళ్లకు ఆటంకం…