ఇంద్రవెల్లి వేదికగా నిర్వహించిన దళిత దండోరా కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం మరుగుతోందని.. బానిస సంకేళ్లను తెంచిన పోరాట స్ఫూర్తి ధైర్యాన్ని ఇస్తోందన్న ఆయన.. ఉద్యమాలకు ఊపిరి ఊదిన కొమురం భీం ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ గాలి పీలిస్తే గొంతు ఎత్తి పోరాటం చేయాలనిపిస్తుంది.. ఈ మట్టికి త్యాగాల చరిత్ర ఉంది.. తుపాకీ…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. రేవంత్ రెడ్డి ఎన్టీవీకి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ఇవాళ రాత్రి 7:30 కి ప్రచారం కానుంది.
కాంగ్రెస్‌లో అంతే…! ఆ పార్టీలో ఇది రొటీన్ డైలాగ్. కొత్త పీసీసీ చీఫ్ వచ్చాక దానికి బ్రేక్ పడుతుందని అనుకున్నారట. కానీ.. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అని నిరూపిస్తున్నారు నాయకులు. ఆ అంశంపైనే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. రేవంత్‌పై మొదలైన ఫిర్యాదుల పర్వం! తెలంగాణ కాంగ్రెస్‌లో కయ్యాలు కామన్. ఏ చిన అంశం తెర మీదకు వచ్చినా.. అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్తాయి. కొత్త పీసీసీ చీఫ్…
కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే అన్ని పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి, సమన్వయ కర్తలను, మండల బాధ్యులను ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహను నియమించగా… నియోజక ఎన్నికల సమన్వయకర్తలుగా.. ఎమ్మెల్స్…
ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీ భవన్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి చార్జీ తీసుకుంటారు. అయితే పీసీసీ చీఫ్ గా రేవంత్ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. సీనియర్లను కలుపుకుపోవడం ఒక ఎత్తు అయితే.. కేడర్ లో జోష్ నింపాల్సిన బాధ్యత మీద పడింది. ఇప్పటికే జానారెడ్డి మొదలుకుని ఒక్కొక్కరు సీనియర్ నేత ఇళ్లకు వెళ్లి కలిసి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. అందరినీ కలుపుకుపోతానని రేవంత్…
రేపు టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి బాధత్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే… గాంధీ భవన్ లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక రేపు పదవీ బాధత్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు రేవంత్ రెడ్డి. తర్వాత అక్కడ నుంచి బయలుదేరి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా నాంపల్లి దర్గాకు చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు రేవంత్. read also : తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ప్రమోషన్ల…
టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియామకంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నాడు అంటే, సోనియా.. రాహుల్ గాంధీలు ఉన్నట్టేనని తెలిపారు. సోనియాగాంధీ ఆదేశాల మేరకు కలిసి పని చేస్తామన్నారు. వ్యక్తిగత అభిప్రాయం ఏది ఉన్నా.. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. పదవి కోసం పోటీ పడటం సహజమని.. నిర్ణయం అయిపోయింది కాబట్టి, పార్టీని అధికారంలోకి వచ్చేలా అందరం కలిసి కృషిచేస్తామన్నారు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నానన్నారు. మేము కొట్లడుడు బంద్ చేసి..…
కొత్తగా ఎంపికైన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సోనియా గాంధీ నిర్ణయం తో పిసిసి గా రేవంత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారని.. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు నిచ్చారు. రేవంత్ రెడ్డి పీసీసీ గా సక్సెస్ కావాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వనరులు దోపిడీకి గురి అవుతుందని… సోనియా గాంధీ ఆశించిన లక్ష్యాలు అమలు కావడం…
పీజేఆర్ కుమారుడు విష్ణు ఇంటికి ఇవాళ రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పీజేఆర్ చరిత్రను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అంటే పీజేఆర్.. పీజేఆర్ అంటే కాంగ్రెస్ అనిపించారని.. సీఎల్పీ నేతగా అప్పటి ప్రభుత్వాలను గడగడలాడించారని.. హైదరాబాద్ కు కృష్ణా జలాల కోసం పీజేఆర్ పోరాటం చేశారని పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో నీటి సమస్య పరిష్కారం.. పీజేఆర్ వల్లే సాధ్యమైందన్నారు. బస్తీలలో ఇప్పటికీ పీజేఆర్ అంటే ప్రేమ ఉందని… తెలంగాణలో పీజేఆర్…