ఈ సంక్రాంతికి ఒకే ఒక్క టాప్ స్టార్ నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ జనం ముందుకు వస్తోంది. జనవరి 14న ‘బంగార్రాజు’ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సినిమాలో నాగార్జున నటవారసుడు నాగచైతన్య సైతం నటించడం విశేషం. కాగా, వీరిద్దరూ కలసి ఇంతకు ముందు నటించిన ‘మనం’ అప్పట్లో ఘన విజయం సాధించిది. ఇక నాగార్జున తరం హీరోలతో పోలిస్తే సంక్రాంతి సంబరాల్లో ఆయన తక్కువగానే పాల్గొన్నారని చెప్పాలి. అయితే 2016లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో పొంగల్ బరిలోకి దూకి,…