ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచాయి. పలు విభాగాల్లో టాలీవుడ్ సినిమాలు సత్తా చాటగా, వాటిలో ప్రధానంగా ఉత్తమ చిత్రంగా నిలిచింది ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రానికి అవార్డు రావడానికి గల కారణాలను జ్యూరీ సభ్యులు కూడా ప్రత్యేకంగా వివరించారు. “భయపడుతూ ఉండే ఒక టీనేజ్ అమ్మాయి ధైర్యవంతురాలిగా మారే కథను ఎంతో అద్భుతంగా, సమర్థవంతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు చాలా…