నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీశాయి. హీరోయిన్ల వస్త్రధారణపై ఆయన ఇచ్చిన ‘ఉచిత సలహా’ సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపడమే కాకుండా, మహిళా కమిషన్ నోటీసుల వరకు వెళ్ళింది. “హీరోయిన్లు పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల గౌరవం తగ్గుతుంది. చీరలో ఉండే అందం మరెందులోనూ ఉండదు.”, “బయట ప్రజలు మీ స్వేచ్ఛను గౌరవిస్తున్నట్లు నటించినా, లోపల మాత్రం మిమ్మల్ని తిట్టుకుంటారు.”, ఈ…
నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ సినిమా వేడుకలో చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన క్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ కావడమే కాకుండా, ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లోని మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ, తన వివరణ ఇచ్చిన క్రమంలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తను అనవసరంగా సలహాలు ఇచ్చానని, ఇకపై ఎవరికీ ఎలాంటి సూచనలు చేయకూడదని అర్థమైందని శివాజీ పేర్కొన్నారు.…
నటుడు శివాజీ వర్సెస్ అనసూయగా మారిపోయిన వివాదం మీద మరోసారి అనసూయ స్పందించింది. నేను ఈ విషయం మీద మరోసారి క్లియర్ గా నా ఉద్దేశాలు చెప్పబోతున్నాను అంటూ ఆమె వరుసగా సోషల్ మీడియా పోస్టులు పెట్టింది. కొన్ని రాబందులు బాధ్యత లేని మీడియా హౌసులు గురించి ఆమె మాట్లాడుతూ తనపై జరుగుతున్న విష ప్రచారాన్ని “టెక్స్ట్‌బుక్ గ్యాస్‌లైటింగ్”గా ఆమె అభివర్ణించారు. బాధ్యతలేని కొన్ని మీడియా సంస్థలు, స్మార్ట్‌ఫోన్ చేతబట్టిన కొందరు వ్యక్తులు తన మాటలను కావాలనే…
హైదరాబాద్‌లోని లులు మాల్ వేదికగా జరిగిన ‘ది రాజా సాబ్’ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రభాస్ వంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న హీరో సినిమా కార్యక్రమం కావడం వల్ల దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది. అయితే, ఈ వేడుక ముగిసిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాక, జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కార్యక్రమం ముగించుకుని హీరోయిన్ నిధి అగర్వాల్ తన కారు వైపు వెళ్తున్న సమయంలో,…