సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై చర్చ జరిగింది. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
Minister Piyush Goyal: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ నేడు (జూన్ 15) అమరావతికి రానున్నారు. రాష్ట్రానికి రానున్న ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలిసి లంచ్ మీట్లో పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధి, కేంద్ర సహకారంపై ప్రధానంగా చర్చించనట్టు తెలుస్తోంది. ఇక లంచ్ అనంతరం కేంద్ర మంత్రి గుంటూరులోని పొగాకు బోర్డ్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రంలో ఉన్న పొగాకు రైతుల సమస్యలు, దిగుబడి ధరలు, మార్కెట్ పరిస్థితులు…