చెన్నై మహానగరం కుండపోత వర్షాలతో గజగజా వణుకుతోంది. ఎక్కడ చూసినా ఈ రెండే కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ ఇప్పటికీ నదులను తలపిస్తున్నాయి. చాలా కాలనీలు నీళ్లలో మునిగిపోయి ఉన్నాయి. తినడానికి తిండిలేక, రాత్రిపూట కరెంటు లేక చెన్నై నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. గురువారం ఉదయం. 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు మీనంబాకంలో 60 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే, నగుబాకంలో 43 మిల్లీ…