విపక్ష కూటమికి ఇండియాగా పేరు పెట్టినట్లు సోమవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ఈ ఇండియా పేరును తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తోంది. దీనిపై నేతలలంతా లోతుగా చర్చించి, ఏకాభిప్రాయంతో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియా అనే పేరును బిహార్ సీఎం నితీష్ కుమార్ గట్టిగా వ్యతిరేకించినట్లు సమాచారం.